Fri Dec 20 2024 16:31:59 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రైళ్లు మళ్లీ పట్టాలపైకి
విశాఖ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లు యధాతధంగా ఉంటాయి
విశాఖ వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇటీవల జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ లతో పాటు మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వే భద్రతా పనుల కారణంగా ఈ ఎక్స్ప్రెస్ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విశాఖ వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దాదాపు నలభై ఐదు రోజులు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
తొలుత ప్రకటించినా...
ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ రద్దు చేయాలని భావించింది. ప్రధానంగా విశాఖ వైపు వెళ్లే అనేక మంది ప్రయాణికులు ఈ రైళ్లపై రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రేపటినుంచి జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ లు యధాతధంగా నడుస్తాయని తెలిపింది. అన్ని రైళ్లను నడిపేందుకు సిద్ధమయింది. ప్రయాణికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story