Mon Dec 23 2024 03:12:38 GMT+0000 (Coordinated Universal Time)
సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం
తాజాగా సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కు కూడా తృటిలో పెనుప్రమాదం తప్పింది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం..
ఒడిశా రైలు ప్రమాద ఘటన తర్వాత.. ఏదొక ప్రాంతంలో రైళ్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఒక్కోసారి సిబ్బంది అప్రమత్తతతో పెనుప్రమాదాలు తప్పుతున్నాయి. తాజాగా సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కు కూడా తృటిలో పెనుప్రమాదం తప్పింది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద రైలు పట్టా విరింగింది. ఈ విషయాన్ని గమనించిన గ్యాంగ్ మెన్ వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు ఆ మార్గం మీదుగా బెంగళూరు వెళ్లాల్సిన సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ ను స్టేషన్ లోనే నిలిపివేశారు.
రైల్వే సిబ్బంది ట్రాక్ వద్దకు చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. గ్యాంగ్ మెన్ పట్టా విరిగి ఉండటాన్ని గమనించకపోయి ఉంటే.. మరో ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది. రెండురోజుల క్రితం గువాహటి నుంచి జమ్మూకు వెళుతున్న లోహిత్ ఎక్స్ప్రెస్ రైలుకు కూడా ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయి ట్రాక్ పైనే ఆగిపోయాయి. అధికారులు వెంటనే ఆ మార్గంలో రైళ్లరాకపోకలను ఆపి, బోగీలను తిరిగి రైలుకు జత చేసి పంపారు.
Next Story