Fri Nov 22 2024 22:50:54 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ.. వర్షాలొస్తున్నాయ్
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా ఆగస్టు 25వ తారీఖు నుంచి 28 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాలు కురవవని అధికారులు చెప్పారు. మళ్లీ సెప్టెంబర్ 3 తర్వాత తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడనం కారణంగా ఐదు రోజుల్లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Next Story