Fri Dec 20 2024 01:08:31 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు రోజులూ వర్షాలే
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అల్పపీడనం కారణంగా గంటకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈనెల 17వ తేదీ వరకు మృత్య్సకారుల చేపలవేటపై నిషేధం విధించింది వాతావరణశాఖ.
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story