Mon Dec 23 2024 01:44:40 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఏం చేసినా చెల్లుతుందంటే ఊరుకోం : ఎమ్మెల్యే రాజాసింగ్
సీఎం జగన్.. తనను అడిగేవారు లేరన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. పురాతన మండపానికి మరమ్మత్తులు చేయకుండా..
"తిరుమలలోని పురాతన మండపాన్ని కూల్చివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మండపాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. మరమ్మతులు చేయకుండా పురాతన మండపాన్ని కూల్చివేయడం సరికాదు" అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తిరుమలలో పురాతనమైన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మండపాన్ని కూల్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కేవలం ఆంధ్రులది మాత్రమే కాదని.. యావత్ భారతీయులదన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామన్నారు.
సీఎం జగన్.. తనను అడిగేవారు లేరన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. పురాతన మండపానికి మరమ్మత్తులు చేయకుండా కూల్చివేయటం తప్పు అని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. తిరుమలలో ఎలాంటి నిర్మాణాన్నీ కూల్చివేయడం లేదని టీటీడీ పేర్కొంది. అత్యంత శిథిలావస్థలో ఉన్న పార్వేటు మండపానికి కూడా పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపింది. పాపవినాశనానికి వెళ్లే దారిలో ఉన్న మండపం పూర్తిగా ఆలయానికి సంబంధించిన మతపరమైన కార్యక్రమాలకు, వార్షిక కార్తీక వనభోజన కార్యక్రమాలకు వినియోగిస్తుందని స్పష్టం చేసింది.
Next Story