Mon Dec 23 2024 08:09:33 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీకి రిమాండ్ పొడిగింపు
ఈ నెల 15వ తేదీ వరకూ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ను పొడిగిస్తూ రాజమండ్రి కోర్టు తీర్పు చెప్పింది
ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకూ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ను పొడిగిస్తూ రాజమండ్రి కోర్టు తీర్పు చెప్పింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు.
తిరిగి జైలుకు...
మే 19వ తేదీన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. ఈ హత్యను తానే చేసినట్లు అనంతబాబు అంగీకరించారు. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబుకు మరోసారి రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు అనంతబాబును తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. అనంబాబును వైసీపీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Next Story