Sun Dec 22 2024 17:58:01 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య మృతి
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి మృతి చెందారు
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి మృతి చెందారు. కిరణ్మయి వయసు 46 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. భార్య అనారోగ్యం కారణంగా రాహుల్ సెలవులో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశం అయింది. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని జైళ్ల శాఖ, ఏపీ హోంమంత్రి తానేటి వనిత వివరణ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ భార్య చనిపోయారనే వార్త బయటకు వచ్చింది.
రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ మొదట మొదట నాలుగు రోజుల పాటు సెలవుపై వెళ్లారు. శుక్రవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఆయన సెలవులో ఉంటారని తెలిపారు. భార్య అనారోగ్యానికి గురి కావడంతో దగ్గర ఉండి చూసుకోవాల్సి రావడంతో రాహుల్ సెలవు పెట్టారని ఉన్నతాధికారులు తెలిపారు. జైళ్ల శాఖ కోస్తాంధ్ర ప్రాంత డిఐజీ రవికిరణ్ జైలు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు.
Next Story