Sun Dec 22 2024 17:46:44 GMT+0000 (Coordinated Universal Time)
సెలవు పెట్టిన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టారు. ఆయన శుక్రవారం నుంచి సెలవుపై వెళ్తున్నట్లు తెలుస్తోంది. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్ భార్యను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ఆ జైలు సూపరింటెండెంట్ సెలవు పెట్టి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా.. ఈ పరిణామం చోటు చేసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.
Next Story