Mon Dec 23 2024 06:53:06 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబును కలవడానికి రజనీకాంత్ రావట్లేదు
చంద్రబాబు నాయుడు అంటే ఎంతో అభిమానం చూపించే వ్యక్తి రజనీకాంత్
చంద్రబాబు నాయుడు అంటే ఎంతో అభిమానం చూపించే వ్యక్తి రజనీకాంత్. పలు సందర్భాల్లో చంద్రబాబుకు సంబంధించిన విషయాల్లో రజనీ అండగా నిలిచారు. చంద్రబాబు నాయుడుతో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయమే. విజయవాడలో జరిగిన నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలకు హాజరైన ఆయన CBNని ప్రశంసించారు. అది కాస్తా వివాదానికి దారి తీసింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా రజనీకాంత్ లోకేష్‌కి ఫోన్ చేసి మాట్లాడారు.
రజనీకాంత్ చంద్రబాబు నాయుడుని కలవనున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. అయితే చంద్రబాబుతో రజనీ కాంత్ ములాఖత్ పై వచ్చిన వార్తలను ఖండించాయి రజనీకాంత్ కార్యాలయ వర్గాలు. రేపు చంద్రబాబుతో రజనీ కాంత్ ములాఖత్ పై వచ్చిన వార్తలను ఖండించాయి ఆయన కార్యాలయ వర్గాలు. రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నారని.. రాజమండ్రి వచ్చే షెడ్యూల్ ఏదీ లేదని స్పష్టం చేశారు వ్యక్తిగత సిబ్బంది.
Next Story