Mon Dec 23 2024 08:03:19 GMT+0000 (Coordinated Universal Time)
దొంగఓట్లతోనే గెలిచా : ఎమ్మెల్యే రాపాక
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దొంగ ఓట్లతోనే గెలిచానని తెలిపారు
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దొంగ ఓట్లతోనే గెలిచానని తెలిపారు. తాను ఎప్పుడైనా దొంగ ఓట్లతోనే గెలుస్తున్నానని చెప్పారు. ఒక ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారని ఆయన అన్నారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఒక ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎప్పుడైనా అంతే...
తన సొంత ఊరులో చింతలమోరులో తనకు దొంగ ఓట్లు వేశారని ఆయన అన్నారు. నిన్న తనకు టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పది కోట్లు ఇవ్వచూపిందని సంచలన కామెంట్స్ చేసిన రాపాక వరప్రసాద్ ఈరోజు ఈ రకమైన కామెంట్లు చేశారు. అక్కడ కాపులు ఎక్కువగా ఉండవని, ఎస్సీ ఓట్లు ఎక్కువని ఒకరిని ఒకరు గుర్తు పట్టలేరని, అందుకే దొంగ ఓట్లు సులువుగా వేయగలిగామని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో 800 ఓట్ల మెజారిటీతో గెలిచానని తెలిపారు.
Next Story