Sat Dec 21 2024 12:59:11 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనాని చెంతకు వైసీపీ నేత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు భేటీ అయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు భేటీ అయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బొంతు రాజేశ్వరరావు 2014, 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో కేవలం 700 ఓట్లతోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన కొద్దిరోజులు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. అనంతరం జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీ మద్దతుదారుగా నిలిచారు.
పార్టీలో చేరేందుకేనా?
బొంతు రాజేశ్వరరావుకు నామినేటెడ్ పదవి అప్పగించింది. ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధినాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన జనసేనలో చేరేందుకే పవన్ ను కలిశారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది.
Next Story