Fri Dec 20 2024 17:51:25 GMT+0000 (Coordinated Universal Time)
ర్యాంకులను సమీక్షించండి.. జీవీఎల్ డిమాండ్
ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ విధానాన్ని పున:సమీక్షించాలని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కోరారు
ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ విధానాన్ని పున:సమీక్షించాలని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కోరారు. ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ రావడంపై అనుమానాలున్నాయననారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు అలా లేవన్న జీవీఎల్ ఈ ర్యాంకింగ్ విధానాన్ని సమీక్షించాలని కోరుతామన్నారు. ఎఫ్ఆర్ఎంబీ ఆంక్షలకు లోబడి రాష్ట్రాలు అప్పలు చేయాలని, కానీ కేంద్రం కళ్లు కప్పి రుణాలు తీసుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు.
ఎన్నికలకు వెళతారా?
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ800 కోట్లు ప్రభుత్వం తీసుకుందని, సాంకేతిక లోపం అని కుంటిసాకులు చెబుతున్నారని, ఎమ్మెల్యేల జీతాలు ఎందుకు మాయం కావడం లేదని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. తీసుకున్న సొమ్ములను వెంటనే జమ చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తామని చెప్పుకుంటున్న జగన్ కు నిజంగా ధైర్యముంటే ఎన్నికలకు వెళతారా? అని ఛాలెంజ్ విసిరారు. వైసీపీ అంటే గోల్ మాల్ పార్టీగా ప్రజలు భావిస్తున్నారన్నారు.
Next Story