Mon Dec 23 2024 10:59:44 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ను అలా వెక్కిరిస్తారా?
ఎన్టీఆర్ పై ఆయనను పదవి నుంచి దించిన వారే ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు
ఎన్టీఆర్ పై ఆయనను పదవి నుంచి దించిన వారే ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ ని దక్కించుకోవడం కోసం నాడు వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారకులైన వారు ఇప్పుడు ఆయనపై వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారని జీవీఎల్ నరసింహారావు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను నువ్వు వారసుడివా? అని వెక్కిరించడం, అవమానించడం టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయాల్లో పరాకాష్ట అని జీవీఎల్ ట్వీట్ చేశారు.
వైసీపీ తప్పిదం కూడా...
ఎన్టీఆర్ ను అందరూ భగవంతుడిగా చూస్తారని, అటువంటి ఎన్టీఆర్ పేరును వైసీసీ వివాదంలోకి లాగడం తప్పేనని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ అంశాన్ని తెరపైకి వైసీపీ తీసుకు వచ్చిందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ మనసును వికృత రాజకీయాల కోసం క్షోభ పెట్టవద్దని జీవీఎల్ తెలుగుదేశం, వైసీీపీలకు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Next Story