Fri Dec 20 2024 22:08:59 GMT+0000 (Coordinated Universal Time)
నడ్డాను అంత మాట అంటారా?
మాజీ మంత్రి పేర్ని నానిపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి పేర్ని నానిపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డాను పట్టుకుని అంత మాట అంటావా? మంత్రలు, మాజీ మంత్రులు బలిసి కొట్టుకుంటున్నారని జీవీఎల్ ఫైర్ అయ్యారు. డబ్బా ఫ్యాన్ పార్టీగా ఆయన అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని జీవీఎల్ వార్నింగ్ ఇచ్చారు. మీరు మాట్లాడే ప్రతి మాటలను ట్రాన్స్లేట్ చేసి పార్టీ హైకమాండ్ కు పంపుతామని చెప్పారు.
ట్రాన్స్ లేట్ చేసి పంపుతాం....
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్న మాట నిజం కాదా? అని జీవీఎల్ నరసింహరావు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారా? లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంత సాయం చేశారన్న దానిపై చర్చకు సిద్ధమేనా అని జీవీఎల్ నరసింహరావు సవాల్ విసిరారు. కొత్తగా తీసుకున్న అప్పుల నుంచి పాత అప్పులను చెల్లిస్తున్నారని, ఇక్కడ వైసీపీ నేతలు బీజేపీ పై చేస్తున్న విమర్శలను హైకమాండ్ దృష్టికి తీసుకు వెళుతామని జీవీఎల్ నరసింహరావు చెప్పారు.
Next Story