Mon Dec 23 2024 14:04:27 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే చేరికలు... వైసీపీ, టీడీపీ ల నుంచే
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో త్వరలో చేరికలు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో త్వరలో చేరికలు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. వైసీపీ, టీడీపీ ల నుంచి తమ పార్టీలోకి నేతలు చేరనున్నారని తెలిపారు. ఇప్పటికే కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారన్న ఆయన, ఎప్పుుడు వారికి కండువాలు కప్పాలన్న విషయంపై తేదీలను ఖరారు చేయనున్నట్లు జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
ఫోకస్ పెట్టి....
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ హైకమాండ్ రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందు ముందు పనిచేస్తామని చెప్పారు. ప్రజలు బీజేపీ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని చూపుతుండటం వల్లనే వరుస విజయాలు సాధ్యమవుతున్నాయని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు.
Next Story