Fri Dec 20 2024 05:12:24 GMT+0000 (Coordinated Universal Time)
మెరిట్ ఆధారంగానే టిక్కెట్లు : విజయసాయిరెడ్డి
వైసీపీలో టిక్కెట్లను త్వరలో ఖరారు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
వైసీపీలో టిక్కెట్లను త్వరలో ఖరారు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్లకే టిక్కెట్లు లభిస్తాయని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో నేతలు చేసిన అభివృద్ధిని ఆధారంగా తీసుకుని మాత్రమే టిక్కెట్లు కేటాయింపులు జరుపుతారని ఆయన అన్నారు.
ట్వీట్ చేసిన...
విజయసాయిరెడ్డి ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ తో వైసీపీలో టిక్కెట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చినట్లయింది. గెలుపు ఆధారంగా, ప్రజల్లో వ్యతిరేకత లేని వాళ్లకే టిక్కెట్లు ఇస్తారని ఆయన చెప్పకనే చెప్పేశారు. సర్వేల ఆధారంగా, సామాజికవర్గాల సమీకరణల నేపథ్యంలోనే వైసీపీలో ఈసారి టిక్కెట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.
Next Story