Fri Dec 20 2024 22:15:26 GMT+0000 (Coordinated Universal Time)
పాపాలు చేసిన వారు అనుభవించాల్సిందే
రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు
రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పాపాలు అనుభవించాల్సిందేనని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని ఆయన పేర్కొన్నరు. గతంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపైనే విచారణ జరుగుతుందన్నారు. ఈడీ విచారణకు రాజకీయాలను ఆపాదించడం తగదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
సహకరించాలంటూ....
వైసీపీ విపక్షాల విమర్శలను ఖండిస్తుందన్నారు. ఈడీని స్వచ్ఛందంగా తమ పని చేసుకునేలా సహకరించాలని కోరారు. మనీలాండరింగ్ జరిగిందంటున్నారని, దానిపై విచారించడం తప్పా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యం చేస్తే పుణ్య ఫలాలు, పాపం చేస్తే పాపం ఫలాలు అనుభవించాల్సిందేనని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు విచారణ జరుగుతుందన్నారు.
Next Story