Fri Apr 04 2025 04:26:19 GMT+0000 (Coordinated Universal Time)
సర్వే చెప్పిందే నిజమవుతుంది
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ 150కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ 150కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పటికే ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19 లోక్సభ స్థానాలు వస్తాయని తేల్చిందన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్యను బట్టి 133 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని సర్వే తేల్చిందని విజయసాయిరెడ్డి అంచనా వేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మరింత కష్టపడితే...
అయితే రానున్న 20 నెలల కాలంలో వైసీపీ నేతలు గడప గడపకు తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించగలిగితే 150కి పైగా స్థానాలను సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 పార్లమెంటు స్థానాలు, టీడీపీకి ఆరు లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story