Mon Dec 23 2024 09:11:28 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ ఇంట రాఖీ వేడుకలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాసంలో రాఖీ పండగ వేడుకలు జరిగాయి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాసంలో రాఖీ పండగ వేడుకలు జరిగాయి. పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ నేతలు లోకేష్ కు రాఖీ కట్టారు. లోకేష్ వారికి శుభాకాంక్షలు అంద చేశారు. తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తో పాటు మరికొందరు లోకేష్ కు రాఖీ కట్టారు. ఆయన వారికి శుభాకాంక్షలను తెలిపారు.
సొంత అక్కా చెల్లెళ్లు లేని...
సొంత అక్కా చెల్లెళ్లు లేని తనకు ఆడపడుచులంతా సొంత సోదరీమణులేనని లోకేష్ వ్యాఖ్యానింాచారు. మహిళలందరికీ అన్నలా అండగా, తమ్ముడిగా తోడుగా ఉంటానని చెప్పారు. ఆడపడచులు చూపించే అనురాగమే తనకు రక్ష అని లోకేష్ అన్నారు. రాఖీ పండగ ముందు రోజే మహిళలు తమ కాళ్లపై నిలబడేందుకు స్త్రీ శక్తి పేరుతో శిక్షణ ఇప్పించామని, కుట్టుమిషన్లను వారికి అందజేయడం సంతోషంగా ఉందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story