Mon Mar 31 2025 22:08:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆ బంధాన్ని అలా పోల్చేసిన వర్మ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఎక్స్ వేదికగా జనసేన-టీడీపీ కలిసి చేసే పోటీ గురించి స్పందించారు. రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ ఆ విషయాన్నే ప్రస్తావించింది. 'ఒక లివింగ్ టుగెదర్ జంట ఎట్టకేలకు పెళ్లిని ప్రకటించింది.. నేను ఏ సందర్భంలో లేదా ఎవరిని ఉద్దేశించి ఇలా చెప్పానో చెప్పగలరా ?' అంటూ ట్వీట్ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పని చేస్తాయని ప్రకటించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ కలిశారు. దాదాపు 40 నిమిషాల భేటీ తర్వాత బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. తనలాంటి వ్యక్తిని తెలంగాణ సరిహద్దుల్లో 200 మంది పోలీసుల్ని పెట్టి ఆపారంటే సామాన్యుడి పరిస్ధితి ఏంటన్నారు. తనను కూడా రానివ్వడం లేదని, మొన్నటి దాకా తానే నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇప్పుడు జనసేన-టీడీపీ కలిసి వెళ్తాయని ప్రకటించారు. ఇది తమ ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించిది కాదని, ఏపీ భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు.
Next Story