Thu Mar 27 2025 08:31:24 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వర్మకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ లో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదయిన కేసుపై హైకోర్టు స్టే విధించింది

ఆంధ్రప్రదేశ్ లో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఆర్టీవీపై నమోదయిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. గుంటూరు సీఐడీ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లను సినిమాలో దూషిస్తూ పోస్టులు పెట్టారంటూ గుంటూరు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారపై స్టే...
అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2019 లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకాలం ఏం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు ఫిర్యాదుచేయడం, దానిపై కేసు నమోదు చేయడం పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు రామ్ గోపాల్ వర్మను కేసుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story