Mon Dec 23 2024 06:34:05 GMT+0000 (Coordinated Universal Time)
ప్రశ్నిస్తే.. అరెస్ట్ చేస్తారా?
వికేంద్రీకరణ అంటూ రోజు స్మరించే జగన్ సర్పంచ్ లను అరెస్ట్ చేయడమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
అధికార వికేంద్రీకరణ అంటూ రోజు స్మరించే జగన్ మోహన్ రెడ్డి సర్పంచ్ లను అరెస్ట్ చేయడమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. పంచాయతీ నిధులు పక్కదారి పట్టించడాన్ని ఆయన తప్పపట్టారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులను తమకు బదలాయించుకోవడం అన్యాయమని, ఇదేమిటని ప్రశ్నించిన సర్పంచ్ లను అరెస్ట్ చేయడం అంతకంటే అన్యాయమని రామకృష్ణ అన్నారు.
జగన్ దృష్టిలో...
జగన్ దృష్టిలో సర్పంచ్ లంటే ఉత్సవ విగ్రహాలేనని రామకృష్ణ అన్నారు. నిధులు, విధులు లేకుండా సర్పంచ్ లు గ్రామాభివృద్ధికి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ బద్దంగా దక్కాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే నిధులు అవసరమని, వాటిని వెంటనే కేటాయించాలని రామకృష్ణ కోరారు.
- Tags
- ramakrishna
- jagan
Next Story