Fri Nov 22 2024 17:12:57 GMT+0000 (Coordinated Universal Time)
నారా బ్రాహ్మణికి సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మోత మొగిద్దాం అనే కార్యక్రమానికి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మోత మొగిద్దాం అనే కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే!! దీనిపై నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. "పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి. చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి" అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. "బ్రాహ్మణి గారూ... మీరు ఒక వర్ధమాన రాజకీయవేత్త. మీకు నేనిచ్చే చిన్న సలహా ఏంటంటే... మీరు ప్రజలపై ఎంత ప్రభావం చూపగలరు అనే అంశాన్ని పరీక్షించుకునేందుకు ఇలాంటి ప్రమాదకర ప్రతిపాదనలు చేయొద్దు. మీ ప్రతిపాదనను ఎవరూ పాటించకపోతే మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్ కు గురవుతుంది. విద్యుచ్ఛక్తి అనేది కాంతివంతంగా ఉండాలే తప్ప ఎప్పుడూ కనెక్ట్ కాకూడదు అని అయాన్ రాండ్ అన్నారు" అంటూ వర్మ ట్వీట్ చేశారు.
Next Story