Mon Dec 23 2024 03:45:34 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి పేర్ని నానితో నేడు ఆర్జీవీ భేటీ
రాంగోపాల్ వర్మ ఈరోజు సచివాలయంలో మంత్రి పేర్ని నానిని కలుస్తారు. వర్మ టిక్కెట్ ధరల తగ్గింపును వ్యతిరేకిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో మూవీ టిక్కెట్ల ధరలపై ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, సినీ ఇండ్రస్ట్రీ పెద్దల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ కేసు నలుగుతున్నా ప్రభుత్వం కమిటీని నియమించి దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. మరోవైపు సినిమా హాళ్లలో ఎక్కువ శాతం స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నారు.
చర్చల్లో....
రాంగోపాల్ వర్మ ఈరోజు సచివాలయంలో 12 గంటలకు మంత్రి పేర్ని నానిని కలుస్తారు. వర్మ కూడా టిక్కెట్ ధరల తగ్గింపును వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తన విధానానికి కట్టుబడి ఉందని పేర్ని నాని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చలు ఏ రకంగా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story