Tue Dec 24 2024 00:25:04 GMT+0000 (Coordinated Universal Time)
వివేకాను హత్య చేసింది అల్లుడు.. చేయించింది చంద్రబాబు
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది చంద్రబాబేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది చంద్రబాబేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలోనే ఈ హత్య జరిగిందని చెప్పారు. హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ప్రకాష్ రెడ్డి అన్నారు.
వైసీపీపై దుష్ప్రచారం....
వివేకానందరెడ్డి ఆర్థిక, రాజకీయాలకు ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డతి వారసుడు కావాలనుకున్నాడని ప్రకాష్ రెడ్డి అన్నారు. నారా లోకేష్ బాబాయి రామ్మూర్తి నాయుడిని గొలుసులతో చీకటి గదిలో బంధించారని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. టీడీపీ పెద్దలను కూడా సీబీఐ విచారించాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వివేకాను హత్య చేసింది ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని, హత్య చేయించింది చంద్రబాబు అని ప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శ చేశారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల వెల్లువలో టీడీపీ కొట్టుకుపోయిందని, ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అనేదే లేదని, అందుకోసమే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story