Tue Dec 24 2024 00:25:01 GMT+0000 (Coordinated Universal Time)
నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మహిళా డైరీ విషయంలో అవకతవకలు జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. పరిటాల కుటుంబం అక్రమ ఆస్తుల విషయంలోనూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పరిటాల రవి పీపుల్స్ వార్ లో ఉంటూ వందల కోట్ల ఆస్తులను ఎలా సంపదారించారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.
అన్ని ఆస్తులు ఎక్కడివి?
పరిటాల కుటుంబానికి బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం జిల్లాల్లో వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పరిటాల కుటుంబం అక్రమ సంపాదన అంతా ప్రజలను దోచుకున్నదేనని అన్నారు. తోపుదుర్తి మహిళా సహకార డైరీలో అవకతకవలు జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Next Story