చంద్రబాబు సీఎం అవ్వడానికి.. వైసీపీ ఎమ్మెల్యే గుండుకు లింక్..!
తనకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. యాభై కోట్ల రూపాయలు ఇస్తే
చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేరని, ఒకవేళ అయితే గుండు కొట్టించుకుంటానని అన్నారు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక గజదొంగ అని.. చంద్రబాబు ఏ రోజైనా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశం ఆయనకు లేదని, శిలాఫలకాలు వేయడం తప్పితే ఏం చేశారని ప్రశ్నించారు. మీ దోపిడీల గురించి మాట్లాడితే బెదిరింపులకు దిగుతారా? అని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. అమరావతిని రియల్ ఎస్టేట్ దందాగా చంద్రబాబు మార్చారని అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంతో పేదల కల నెరవేరుతోందని అన్నారు. చంద్రబాబులా పేదలను దోచుకునే అలవాటు తమకు లేదని అన్నారు.