Sun Dec 22 2024 22:19:12 GMT+0000 (Coordinated Universal Time)
ఏడుకొండల్లో నామాల తొండ
ఈ తొండ చూడటానికి నల్లటి శరీరంతో.. వెన్నుపూసపై తెల్లని నామంతో, మధ్యలో ఎర్రని తిరుచూర్ణం పెట్టినట్టుగా కనిపిస్తోంది.
ఏడుకొండలపై కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. నిత్యం శ్రీవారి నామ స్మరణతో మారుమ్రోగే ఏడుకొండల్లో.. అరుదైన తొండ కనిపించింది. అదే నామాల తొండ. అటవీశాఖ అధికారులకు ఈ తొండ దర్శనమిచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ అరుదైన తొండను గుర్తించినట్టు అటవీ శాఖ సిబ్బంది వెల్లడించారు. ఫారెస్ట్ లిజార్డ్ గా పిలిచే ఈ నామాల తొండ అలిపిరి సమీపంలో ఓ బండపై కనిపించింది.
ఈ తొండ చూడటానికి నల్లటి శరీరంతో.. వెన్నుపూసపై తెల్లని నామంతో, మధ్యలో ఎర్రని తిరుచూర్ణం పెట్టినట్టుగా కనిపిస్తోంది. అలాగని దానికెవరైనా నామం పెట్టారనుకుంటే పొరపాటే. తొండల్లో ఈ నామాల తొండ ఒక రకం. ఈ అరుదైన నామాల తొండ.. దక్షిణ భారత దేశంలోని రతి కొండలు ఉన్న అడవుల్లో ఎక్కువుగా కనిపిస్తుందట. సరీసృపాల జాతికి చెందిన ఈ తొండలు దక్షిణాసియా, దక్షిణ చైనా, ఆగ్నేయాసియాలో అధికంగా దర్శనమిస్తాయి. ఏడుకొండల్లో నామాల తొండ కనిపించిందన్న విషయం తెలియగానే.. భక్తులు దానిని ఆ దేవుడే పంపినట్లుగా భావించారు. ప్రస్తుతం ఈ నామాల తొండ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story