Tue Dec 24 2024 02:17:13 GMT+0000 (Coordinated Universal Time)
అరసవల్లిలో రథసప్తమి వేడుకలు
రథసప్తమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి దేవస్థానంలో వేడుకగా జరుగుతున్నాయి
రథసప్తమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ దేవస్థానంలో వేడుకగా జరుగుతున్నాయి. సూర్యభగవానుడి జన్మదినోత్సవంగా భావించే రోజు కావడంతో ఉదయాన్నే వేల సంఖ్యలో భక్తులు చేరుకుని స్వామిని దర్శించుకుంటుననారు. స్వామివారికి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పట్టువస్త్రాలను ప్రభుత్వం తరుపున సమర్పించారు. తొలి పూజను నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు.
తిరుమలలో
ఇక తిరుమలలో కూడా రథసప్తమి వేడుకలు ఏకాంతంగా ప్రారంభమయ్యాయి. సప్తవాహనాలలో మలయప్ప స్వామి ఊరేగననున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలను ముగియనున్నాయి. ఈరోజు రథసప్తమి సందర్భంగా తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు.
Next Story