Sun Dec 22 2024 17:35:47 GMT+0000 (Coordinated Universal Time)
కడపోళ్లకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం : రాయపాటి
కడప వాళ్లకు నరసరావుపేట పార్లమెంటు సీటు ఇస్తే తాము సహకరించేది లేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు
కడప వాళ్లకు నరసరావుపేట పార్లమెంటు సీటు ఇస్తే తాము సహకరించేది లేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. తమ వర్గం వారికి సహకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి తాను మరోసారి పోటీ చేయనని, తన కుమారుడు, కుమార్తెకు రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వమని చంద్రబాబును ఇప్పటికే తాను కోరినట్లు రాయపాటి వెల్లడించారు. మైదుకూరు టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేష్ కు నరసరావుపేట ఎంపీ టిక్కెట్ ఖాయమని వార్తలు రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మాకు రెండు సీట్లు...
తాడికొండ సీటును తోకల రాజవర్థన్ రావుకు ఇస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి గెలుస్తారన్న రాయపాటి కడపోళ్లకు మాత్రం సీటిస్తే ఓడిస్తామని చెప్పారు. అంత అవసరమైతే తానే పోటీ చేస్తానని చెప్పారు. తాను కనక పోటీలోకి దిగితే వీళ్లెవ్వరూ పనికి రారని, నా సీటు వేరెవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని రాయపాటి తెగేసి చెప్పారు. జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story