Mon Dec 23 2024 12:58:11 GMT+0000 (Coordinated Universal Time)
రాధా రెక్కీ విషయం తేల్చాల్సిందే...?
వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిన విషయంలో లోతైన దర్యాప్తు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు
వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిన విషయంలో లోతైన దర్యాప్తు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే దాని ఫలితాన్ని వైసీపీ అనుభవించాల్సి వస్తుందని రఘురామ కృష్ణరాజు అన్నారు.
పీఆర్సీ విషయంలో...
ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని రఘురామ కృష్ణరాజు అన్నారు. జాప్యం చేయాలని చూస్తే చివరకు పార్టీ మెడకు చుట్టుకోవడం ఖాయమని అన్నారు. ప్రభుత్వోద్యోగుల వల్లనే ఈ ప్రభుత్వం నడుస్తుందని, ఆ విషయాన్ని గమనించకుండా ముందకు వెళితే ఫలితం అనుభవిస్తారని రఘురామ కృష్ణరాజు అన్నారు.
Next Story