Sun Nov 17 2024 18:45:59 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుది సిగ్గులేని జన్మ : పేర్ని నాని ఫైర్
గుంటూరు ఘటనకు సంబంధించి చంద్రబాబుకు రక్తపు మరకలు అంటకుండా కొన్ని మీడియాసంస్థలు ప్రచారం చేస్తున్నాయని పేర్ని నాని అన్నారు
గుంటూరులో జరిగిన ఘటనకు సంబంధించి చంద్రబాబుకు రక్తపు మరకలు అంటకుండా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ నెపాన్ని ఉయ్యూరు ట్రస్ట్ పై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. సంక్రాంతి పేరుతో జనాలను భారీగా తరలించింది టీడీపీ నేతలు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ముందే సంక్రాంతి పండగ వచ్చినట్లు ప్రచారం ఇచ్చిన మీడియా సంస్థలు ఘటన జరిగిన వెంటనే ప్లేటు ఫిరాయించారన్నారు. ఘటన తర్వాత చంద్రబాబు దిక్కుమాలిన ప్రకటన చేశారని పేర్ని నాని అన్నారు.
టీడీపీ కార్యక్రమమే...
ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమమని, ఘటన తర్వాత తమకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ నేతలు పేదల పేదరికాన్ని వాడుకునే ప్రయత్నం జరిగిందన్నారు. మీటింగ్లకు జనం రాకపోతే ఏ విధంగా తెచ్చుకోవాలో ఆయనకు తెలుసునని తెలిపారు. 30 వేల మందికి ఇంటింటికి వెళ్లి టోకెన్లు ఇచ్చింది నిజం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అనుమతులన్నీ టీడీపీ నేతలే తీసుకున్నారన్నారు. లారీలకు పరదాలు కప్పి సరుకు తెచ్చామని ప్రజలను నమ్మించారన్నారు. కానీ ఆ లారీల్లో సరుకు లేదన్నారు. కేవలం చంద్రబాబు మీటింగ్ కేవలం టోకెన్లు ఇచ్చి సభను విజయవంతం చేయాలని ప్రయత్నించడం వల్లనే తొక్కిసలాట జరిగిందని పేర్ని నాని ఆరోపించారు.
గ్రాఫిక్స్ చూపించడంలో...
భవిష్యత్ లో కూడా అమెరికాలోని స్వచ్ఛంద సంస్థల పేరిట ఈ మోసాలు చేయనున్నారా? అని పేర్ని నాని నిలదీశారు. టోకెన్లు పంచి పెట్టి మోసం చేయాలనుకోవడం నిజం కాదా? అని అన్నారు. పదివేలు పట్టే గ్రౌండ్ లో ముప్ఫయి వేల మందిని డంప్ చేసి వారి మరణాలకు కారణమయ్యారన్నారు. ఇన్ని వేలమందిని ఉయ్యూరు ట్రస్ట్ ఎలా సమీకరిస్తుందని ఆయన అన్నారు. 2014 నుంచి ఇదే డ్రామాలు చంద్రబాబు ఆడుతున్నారన్నారు. అమరావతి గ్రాఫిక్స్ చూపించిన తరహాలోనే సభకు పట్టనంత జనం వచ్చారన్న బిల్డప్ ఇచ్చే ప్రయత్నంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కనీసం లోకేష్ పాదయాత్ర పోస్టర్ లో చంద్రబాబు ఫొటోలేకపోవడంతో తండ్రీ కొడుకుల మధ్య ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు.
సొంతపుత్రుడిపై నమ్మకం లేకనే...
సొంత పుత్రుడిపైన లేని నమ్మకం చంద్రబాబుకు దత్తపుత్రుడిపై ఉందన్నారు. బీజేపీతో కలసి నడుస్తున్న పవన్ అంటే సీపీఐకి ఇష్టమన్నారు. ఇలా అన్ని పార్టీలు కలసి జగన్ తో యుద్ధం చేయడానికి వస్తున్నారంటేనే ప్రభుత్వం ప్రజల్లో ఎంత బలంగా ఉందో అర్థంఅవుతుందన్నారు. వావి వరస లేని అనుబంధాలని పేర్ని నాని అన్నారు. ఎంత మంది కలసి వచ్చినా జగన్ ను అంగుళం కూడా కదిలించలేరని అన్నారు. రాజకీయాన్ని మరింత దిగజార్చే ప్రయత్నం చేయవద్దని చంద్రబాబుకు పేర్ని నాని కోరారు. ఎన్ఆర్ఐలు ఎగేసుకుంటే వస్తే ఇలాంటి రొంపిలో ఇరుక్కుపోతారని నాని హెచ్చరించారు.
Next Story