Mon Dec 23 2024 11:54:12 GMT+0000 (Coordinated Universal Time)
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్లకు నోటిఫికేషన్ విడుదల
https://ug.ntruhsadmissions.com వెబ్సైట్లో ప్రాధాన్యత క్రమంలో అన్ని కళాశాలలకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అమరావతి : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది. https://ug.ntruhsadmissions.com వెబ్సైట్లో ప్రాధాన్యత క్రమంలో అన్ని కళాశాలలకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని విడతల కౌన్సెలింగ్ లలోనూ సీట్ల కేటాయింపుకు ఈ ఆప్షన్లనే పరిగణలోకి తీసుకోనున్నారు.
విద్యార్థులు ఆప్షన్లను ఎంచుకునే సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీలకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. తర్వాత విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు లభించిందన్న సమాచారం వారి మొబైల్ కు మెసేజ్ రూపంలో వస్తుందని రిజిస్ట్రార్ డా.కె. శంకర్ తెలిపారు. ఆప్షన్ల నమోదు సమయంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే 7416563063, 7416253073, 8333883934, 9063500829 నంబర్లను సంప్రదించాలని, ఇతర సలహాలు, సందేహాల నివృత్తికై 08978-780501, 07997710168 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
Next Story