Mon Dec 23 2024 07:56:06 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన అనంతబాబు రిమాండ్
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు రిమాండ్ నేటితో ముగియనుంది.
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు రిమాండ్ నేటితో ముగియనుంది. నేడు ఆయనను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు 14 రోజుల రిమాండ్ ముగిసింది. పోలీసులు విచారణ నిమిత్తం ఎటువంటి కస్టడీ పిటీషన్ వేయలేదు. ఇది కొంత రాజకీయంగా చర్చనీయాంశమైంది.
హత్య కేసులో...
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతబాబును వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ హత్య కేసులో రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపర్చనున్నారు. కారు డ్రైవర్ హత్య కేసు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Next Story