Fri Dec 20 2024 12:35:33 GMT+0000 (Coordinated Universal Time)
హాట్ టాపిక్ కొడాలి నాని కామెంట్స్
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 24 మంది మంత్రులు రాజీనామా చేశామని, ఈ నెల 11న కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆయన తెలిపారు. అయితే కేబినెట్ సమావేశంలో ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఐదాగురు మంత్రులకు రెన్యువల్ లభించే అవకాశం ఉందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. సీనియర్ మంత్రులకు అవకాశం దక్కవచ్చునని ఆయన తెలిపారు.
ఐదారుగురు ఎవరు?
జగన్ తీసుకునే ఏ నిర్ణయమైనా సంచలనంగానే ఉటుందన్నారు. తాను కేబినెట్ లో కొనసాగుతానన్న నమ్మకం తనకు లేదన్నారు. పార్టీ కోసం పనిచేయమన్నా జగన్ కోసం తృప్తిగా పనిచేస్తానని కొడాలి నాని తెలిపారు. అయితే కొడాలి నాని అన్నట్లు ఆ ఐదారుగురు కొనసాగేవారెవరు? అన్న దానిపై చర్చ జరుగుతుంది. సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా నూతన మంత్రి వర్గం ఎంపిక ఉంటుందని కొడాలి నాని తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులందరూ ప్రభుత్వ వాహనాలను వదిలేసి తమ వ్యక్తిగత వాహనాల్లో వెళ్లిపోవడం విశేషం.
Next Story