Mon Dec 23 2024 18:40:11 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రుల కమిటీతో సమావేశమైన కొన్ని సంఘాలు
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మంత్రుల కమిటీతో సమావేశమయ్యారు
ప్రభుత్వ గెజిటెడ్ అధికారుల సంఘం నేడు మంత్రుల కమిటీతో సమావేశం అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు ఎవరూ తాము చర్చలకు రాబోమని చెప్పారు. దీంతో ఏ ఉద్యోగ సంఘం వచ్చినా తాము చర్చిస్తామని మంత్రుల కమిటీ చెప్పింది. పీఆర్సీ జీవోను రద్దు చేయకపోవడం, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలన్న డిమాండ్ ను వీరు మంత్రుల కమిటీ ముందు ఉంచనున్నారు. ఉద్యగో సంఘాల నేతలు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరుపుతున్నారు.
చర్చలు జరుపుతున్న...
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మంత్రుల కమిటీతో సమావేశమయ్యారు. ప్రధానంగా పీఆర్సీ కారణంగా తమ జీతాల్లో కోత పడిందన్న దానిపైనే వారు చర్చిస్తున్నారు. డీఏలను పక్కన పెడితే గ్రాస్ శాలరీ కూడా తగ్గుతుందని వారు మంత్రుల కమిటీతో చెబుతున్నారు. మొత్తం మీద ప్రధాన సంఘాల నేతలు మంత్రుల కమిటీతో దూరంగా ఉన్నా కొన్ని సంఘాలు చర్చలకు సిద్దమవుతుండటం విశేషం.
Next Story