Mon Dec 23 2024 05:43:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఆత్మకూరు ఎన్నిక ఫలితం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం నేడు విడుదల కానుంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారభం కానుంది
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం నేడు విడుదల కానుంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారభం కానుంది. కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ కోసం....
మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 20 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరీంధర్ ప్రసాద్ తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. ఈ ఉప ఎన్నికలో 1.37 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది.
Next Story