Mon Nov 18 2024 23:50:28 GMT+0000 (Coordinated Universal Time)
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 64.23 శాతం ఉత్తీర్ణత లభించింది. అయితే మరోసారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేది లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదే చివరిసారి అని ఆయన చెప్పారు. విద్యార్థులు కూడా సక్రమంగా చదువుకుని పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణతను సాధించాలని బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు.
విలీనం చేయలేదు....
ఈ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రంలో 1,91,846 విద్యార్థులు హాజరు కాగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. బాలురు 60.83 శాతం, బాలికలు 68.76 శాతం ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 87.52 శాతం ఉత్తీర్ణత సాధించిందని, అతి తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లలో 46.66 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని బొత్స తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల విలీనం చేయలేదని, కేవలం తరగతుల గదులను మాత్రమే చేస్తున్నామని ఆయన తెలిపారు.
Next Story