Mon Dec 23 2024 17:09:37 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ జోరు
ఏపీలోని మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో రెండు అధికారికంగా వెలువడ్డాయి. రెండింటినీ టీడీపీ గెలుచుకుంది
ఆంధ్రప్రదేశ్ లోని మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల్లో రెండు అధికారికంగా వెలువడ్డాయి. రెండింటినీ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిం కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లులెక్కించిన అనంతరం అధికారలు కంచర్ల శ్రీకాంత్ 34,108 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు. కంచర్ల శ్రీకాంత్ కు ధృవీకరణ పత్రాన్ని అందచేశారు.
రెండు చోట్ల....
ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది. అక్కడ చిరంజీవి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు జరిగిన తర్వాత గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ రెండింటిని కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థుల అఖండ మెజారీటీతో విజయం సాధించారు. అధికారుల నుంచి వారు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా జరగుతుంది.
Next Story