Breaking: టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల అక్రమాలను ఛేదించిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.!
పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారా?
నోవా గ్రూప్ చైర్మన్, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గత ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (APSDRI) ఆరోపించారు. నోవా అగ్రి టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అక్రమ ధన ప్రవాహం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించాయి రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు. ఓటర్లకు డబ్బులు పంచారని ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లా పోలీసులు ఆదాయపన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ వర్గాలను అప్రమత్తం చేశాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి సాక్ష్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నోవా అగ్రి టెక్ ప్రాగంణంలో జనవరి 24న సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా ఓ డైరీ లభించింది. అందులో 2019 ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బుల్చిన వివరాలు ఉన్నాయని తెలుస్తోంది.