Mon Dec 23 2024 07:06:43 GMT+0000 (Coordinated Universal Time)
కబడ్డీ ఆడుతూ కింద పడిన రోజా
చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో ఆటలను ఆర్కే రోజా ప్రారంభించారు
మంత్రి రోజా యాక్టివ్ గా ఉంటారు. అందులోనూ పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ఆయన ఆటల్లోనూ ముందుంటారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో ఆటలను ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఆడి విద్యార్థులను అలరించారు. ఆటగాళ్లను మరింత ప్రోత్సహించాలని రోజా క్రీడా కార్యక్రమాలకు వెళ్లినప్పుడల్లా తప్పనిసరిగా ఆట ఆడతారు.
కంగారు పడాల్సిన పనిలేదని...
అయితే కబడ్డీ ఆట ఆడిన రోజా కింద పడటంతో అందరూ కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. వారు తేరుకునేలోపు రోజా లేచి తిరితి కూతకు వెళ్లడం విశేషం. ఆటల్లో పడటం సహజమేనని రోజా అన్నారు. తనకు ఏమీ కాలేదని, కంగారు పడాల్సిన పనిలేదని రోజా తెలిపారు. రోజాను కింద పడేసిన విద్యార్థులు సారీ చెప్పినా ఆమె వారించి వారికి నచ్చ చెప్పారు.
Next Story