Mon Dec 15 2025 03:57:31 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్కే రోజా
తనపై సీఎం వైఎస్ జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వనరులతో పర్యాటక..

వెలగపూడి : ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో రోజాతో పాటు భర్త సెల్వమణి, కుమారుడు, కూతురు అన్షు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తనపై సీఎం వైఎస్ జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వనరులతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏపీ మంత్రులుగా ఉన్నవారంతా జగన్ కు సైనికుల్లా పనిచేశారని, తాము కూడా జగన్ అడుగుజాడల్లో నడుస్తామని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం వైఎస్ జగన్ను కలిసిన రోజా.. గండికోట నుంచి బెంగళూరుకు టూరు కోసం మొదటి బస్సు విషయంపై తొలి సంతకం చేసినట్టు చెప్పారు.
Next Story

