Thu Apr 10 2025 15:00:48 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్కే రోజా భర్తకు అరెస్ట్ వారెంట్
ఆర్కే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణికి చెన్నై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఆర్కే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణికి చెన్నై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెన్నై జార్జిటౌన్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. ఒక పరువు నష్టం కేసులో సెల్వమణి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2016లో నమోదయిన ఈ కేసుకు సంబంధించి వారెంట్ ను జార్జిటౌన్ కోర్టు జారీ చేసింది.
పరువు నష్టం కేసులో....
2016లో సెల్వమణి ఒక టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రా గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బోద్రా సెల్వమణితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసుపై పరువునష్టం దావా వేశారు. అయితే కేసు వేసిన బోద్రా మరణించారు. ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవగడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
Next Story