Mon Dec 23 2024 02:07:15 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయాణీకులను కాపాడిన ప్రమాదం
ఓ ప్రమాదం బస్సుకు ఘోర యాక్సిడెంట్ అవ్వకుండా.. ఆ బస్సులోని ప్రయాణీకులను
ఓ ప్రమాదం బస్సుకు ఘోర యాక్సిడెంట్ అవ్వకుండా.. ఆ బస్సులోని ప్రయాణీకులను కాపాడింది. ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టింది ఓ లారీ. నవతా ట్రాన్స్ పోర్ట్ లారీ ప్రయాణీకులను కాపాడింది. శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడు కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కు బ్రేకులు ఫెయిల్ అయింది. దీంతో బస్సును ఆపడానికి డ్రైవర్ ప్రయత్నం చేస్తూ ఉండగా.. నరసరావుపేట వైపు నుంచి వెళ్తున్న నవత ట్రాన్స్పోర్ట్ లారీ అనుకోని విధంగా ఆ బస్సుకు ఢీకొట్టి ఆపింది. దీంతో బస్సు అక్కడికక్కడ ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. తమ ప్రాణాలను ఆ లారీ కాపాడిందని ప్రయాణికులు చెప్తున్నారు. నవతా ట్రాన్స్పోర్ట్ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడినట్లు అయింది.
ఈ ఘటన పెట్లూరు వారి పాలెం ఉప్పలపాడు మధ్య చోటు చేసుకుంది. లారీ, బస్సు డ్రైవర్లకు ఎటువంటి గాయాలు అవలేదు. లారీ ముందు భాగం కొంతమేర దెబ్బతింది. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story