Mon Dec 23 2024 03:46:01 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడులో ఘోరం.. అనంతపురం జిల్లాలో ట్రాలీ ఆటోను బైక్ ఢీకొట్టడంతో
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
పల్నాడు జిల్లాలో ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. యడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన భోజనం చేస్తున్నవారిపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.క్షతగ్రాతులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మద్దినేని వారిపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈదర రమణయ్య (55), మాల్యాద్రి (45) లను మృతులుగా పోలీసులు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో యాక్సిడెంట్:
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్ని ముష్టూరు వద్ద ట్రాలీ ఆటోను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story