Mon Dec 23 2024 15:23:37 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పీఏను కాపాడటం కోసమే?
నారా లోకేష్ పీఏపై వచ్చిన ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకే తెలుగు మహిళలు నారీ దీక్ష చేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.
నారా లోకేష్ పీఏపై వచ్చిన ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకే తెలుగు మహిళలు నారీ దీక్ష చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. నారీ సంకల్ప దీక్ష ఎవరి కోసం చేస్తున్నారో టీడీపీ మహిళలు చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మహిళలపై అనేక దాడులు జరిగాయన్నారు. టీడీపీ నాయకుడి లైంగిక వేధింపుల వల్లనే విజయవాడలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆర్కే రోజా అన్నారు.
అప్పుడు ఏమయ్యారు?
తెలుగుదేశం పార్టీలో నారీ నరకాసురులు ఎక్కువయిపోయారన్నారు. కత్తెర పట్టుకుని తిరిగిన టీడీపీ మహిళా నేతలు అప్పడు ఎక్కడకు వెళ్లారని రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మహిళల సంరక్షణ కోసం అనేక చట్టాలను తెచ్చారని చెప్పారు. మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే జగన్ ఊరుకోరని రోజా అన్నారు.
Next Story