Fri Nov 08 2024 15:43:45 GMT+0000 (Coordinated Universal Time)
Ram Madhav : మన తెలుగోడికి కీలక బాధ్యతలు... రామ్ మాధవ్ మళ్లీ యాక్టివ్
ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ చేసిన సూచనలతో బీజీపీ రామ్ మాధవ్ ను మళ్లీ క్రియాశీలం చేసింది
ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ చేసిన సూచనలతో బీజీపీ రామ్ మాధవ్ ను మళ్లీ క్రియాశీలం చేసింది. రామ్ మాధవ్ జమ్ము కాశ్మీర్ ఇన్ ఛార్జిగా నియమించారు. రామ్ మాధవ్ తో పాటు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించినప్పటీకి రామ్ మాధవ్ కే పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలను జమ్మూ కాశ్మీర్ లో అప్పగిస్తారని తెలిసింది. రామ్ మాధవ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే అయినా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఒంటపట్టించుకున్న వ్యక్తి. పదవుల కోసం కాకుండా కేవలం ఆర్ఎస్ఎస్ భావాజలాన్ని వ్యాప్తిచేయడానికే రామ్ మాధవ్ ఎక్కువ తపన పడేవారు.
సిద్ధాంతాలను అవపోసన పట్టి...
ఆర్ఎస్ఎస్ అంటే ఆయనకు ప్రాణం. రామ్ మాధవ్ కాకినాడలో చదివారు. అమలాపురంలో ప్రాధమిక విద్యను మొత్తం పూర్తి చేశారు. తర్వాత కాకినాడలో పాలిటెక్నిక్ పూర్తి చేశారు. అనంతరం ఇంజినీరింగ్ ను కూడా పూర్తి చేశారు. అంతేకాదు పొలిటికల్ సైన్స్ లోనూ పట్టాను పొందారు. సమగ్రమైన అవగాహన ప్రతి అంశంపై ఉంది. జాతీయ, అంతర్జాతీయ విషయాలు, పరిణామాలపై అవగాహన ఎన్పటికప్పుడు ఏర్పరచుకుంటూ మంచి పట్టు సాధించారన్న పేరుంది. విషయ పరిజ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఆయన ఏ విషయంపైనా మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుంటే శ్రోతలు చెవులప్పగించి వినాల్సిందే. అచ్చమైన తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సమగ్రమైన అవగాహన ఉంది. అందుకే ఆయన దేశ, విదేశాలకు వెళ్లినా భాష అడ్డు రాదు.
గతంలోనూ...
గతంలనూ రామ్ మాధవ్ ను ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలను అప్పగిస్తే సక్సెస్ ఫుల్ గా మిషన్ ను పూర్తి చేశారు. ముఖ్యంగా దాదాపు ఇరవై ఐదేళ్ల కమ్యునిస్టుల అడ్డాలో ఉన్న త్రిపురలో కాషాయ జెండా ఎగరడానికి కారణం రామ్ మాధవ్. త్రిపురలో బీజేపీ గెలవడంతో కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో రామ్ మాధవ్ తిరిగి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. వ్యూహాలను రచించడంలో దిట్టగా పేరు గాంచిన రామ్ మాధవ్ ను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు చేసిన సూచనతో తిరిగి రామ్ మాధవ్కు జమ్మూ కాశ్మీర్ బాధ్యతలను అప్పగించారు.
ఆర్ఎస్ఎస్ సూచనతో...
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా కూటమి తృటిలో అధికారాన్ని కోల్పోయింది. అందుకే ఆర్ఎస్ఎస్ సూచనతో మోదీ, అమిత్ షాలు రామ్ మాధవ్ కు మళ్లీ బాధ్యతలను అప్పగించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఆర్ఎస్ఎస్ లో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన సేవలను పార్టీ తిరిగి వినియోగించుకోవడానికి సిద్ధమయిందంటే.. ఆయన స్ట్రాటజీలపై ఎంత నమ్మకమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో రామ్ మాధవ్ వ్యూహాలు ఫలించి బీజేపీ గెలిస్తే మరోసారి ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారే అవకాశం లేకపోలేదు. మన తెలుగోళ్లు ఇద్దరినీ జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జులుగా నియమించడం అంటే అది అందరికీ గర్వకారణమే కదా.?
Next Story