Mon Dec 15 2025 00:12:51 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : 100 అడుగుల లోయలో పడిన బస్సు.. లోపల 50 మందికి పైగా ప్రయాణికులు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు సుమారు 100 అడుగుల లోయలో పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చెట్టు కొమ్మను తప్పించబోయిన డ్రైవర్.. బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 30 మంది గాయపడ్డారు. 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story


