Sun Dec 22 2024 22:35:00 GMT+0000 (Coordinated Universal Time)
జంపన్న వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి
జంపన్న వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు
జంపన్న వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. జంగారెడ్డి గూడెం వద్ద ఉన్న జంపన్న వాగులో బస్సు బోల్తా పడింది. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఈ వాగు ఎప్పుడూ నిండుగా ఉండేది. కానీ వర్షాలు లేకపోవడంతో జంపన్న వాగులో నీరు లేకపోవడం తో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
స్థానికులు సాయంతో....
బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులున్నారు. వీరిలో ఇద్దరు మరణించగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు బస్సులో నుంచి చాలా మంది ప్రయాణికులను బయటకు తీసుకు వచ్చారు. దీంతో మృతుల సంఖ్య తగ్గింది.
Next Story