Mon Dec 23 2024 17:35:30 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు
ఏపీ లో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. డీజిల్ సెస్ పేరిట ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. డీజిల్ సెస్ పేరిట ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విజయవాడ, విశాఖపట్నం సిటీ బస్సులకు మాత్రం ఛార్జీల పెంపును మినహాయించారు. దూర ప్రాంత ప్రయాణాలకు ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు సామాన్యుడికి భారంగా మారాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులకు రూ.20 నుంచి రూ.25 ల వరకూ పెంచారు.
పెరిగిన ఛార్జీలు...
ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.90లు, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.120లు, ఏసీ సర్వీసుల్లో రూ.140 ల వరకూ బస్సు ఛార్జీలు పెరిగాయి. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీకి భారంగా మారింది. దాదాపు రూ.250 కోట్ల నష్టం వస్తుంది. తాజాగా పెంచిన ధరలతో కొంత భారం తగ్గించుకోవచ్చన్నది ఆర్టీసీ యాజమాన్యం ఉద్దేశం. అయితే దూరాన్ని బట్టి ఛార్జీలను పెంచామని, ప్రయాణికులు సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరుతుంది.
Next Story